Fri Nov 22 2024 20:40:52 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : నేడు తిరుమలలో నేరుగా స్వామి వారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. తిరుమలలోని వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎక్కడ చూసినా కనిపించే భక్తులతో రద్దీగా ఉండే తిరుమల నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు, జాతీయ రహదారులపై నీరు నిలవడం, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో భక్తులు తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. దీంతో తిరుపతి పట్టణానికి చెందిన స్థానికులు నేడు ఎక్కువ మంది వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వసతి గృహాల బుకింగ్ కౌంటర్ల వద్ద కూడా భక్తులు లేరని అధికారులు తెలిపారు.
నేరుగా దర్శనానికి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటలలో పూర్తవుతుంది. దీంతో ఎక్కువ మంది భక్తులు రెండు సార్లు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,498 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,355 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story