Wed Oct 30 2024 01:27:30 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడుగా నేరుగా స్వామి వారి దర్శనం...క్యూ లైన్ లో వేచి ఉండకుండానే?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. నిన్నటి నుంచే భక్తుల సంఖ్య అంతగా లేకపోవడంతో భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు నేరుగా క్యూ లైన్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వచ్చిన వారు వచ్చినట్లే శ్రీవారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వసతి గృహాలు కూడా పెద్దగా వెయిట్ చేయకుండానే వెంటనే దొరుకుతుండటంతో భక్తులు ఇబ్బంది పడటం లేదు. వెంగమాంబ అన్న ప్రసాదం వద్ద కూడా పెద్దగా రష్ లేకపోవడంతో వచ్చిన భక్తులకు వచ్చినట్లే అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు.
ఆరు గంటల సమయం...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. నేరుగా భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు 7.45 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,095 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,217 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story