Mon Dec 23 2024 16:14:21 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : క్యూ లైన్ లో వేచి ఉండకుండా నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. క్యూ కాంప్లెక్స్్లోని కంపార్ట్ మెంట్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత కారణంగా కూడా భక్తుల రద్దీ తగ్గిందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు పూర్తి కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికలు, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రద్దీ అంతగా లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 56,228 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. వీరిలో 18,886 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.04 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో వేచి చూడకుండానే భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. సర్వదర్శనం భక్తులు కూడా ఆరు గంటల్లో దర్శనం పూర్తవుతుంది.
Next Story