Wed Oct 30 2024 01:31:52 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : ఎన్నాళ్లకెన్నాళ్లకు... క్యూ లైన్ లో వేచి ఉండకుండానే నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. క్యూ లైన్లు కూడా నిండ ిపోతున్నాయి. స్వామి వారి హుండీ ఆదాయం కూడా భారీగా వచ్చింది. భక్తులు స్వామి వారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే కాకుండా మిగిలిన వారాల్లో కూడా భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. అనేక మంది భక్తులు గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థిితి ఏర్పడింది. పిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో ఇబ్బంది పడకుండా అన్న ప్రసాదాలను ఉచితంగా శ్రీవారి సేవకుల చేత పంపిణీ చేయించారు.
తగ్గిన రద్దీ....
అయితే సోమవారం మాత్రం భక్తుల రద్దీ తగ్గింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి చూడకుండా నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,984 మంది భక్తులు తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమల వెళ్లేవారు మాత్రం నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకునే వీలుంది.
Next Story