Wed Oct 30 2024 01:28:13 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ నేరుగా.. శ్రీవారి దర్శనం.. ఎంత లక్కో?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వచ్చిన భక్తులకు వెంటనే స్వామి వారి దర్శనం అవుతుంది. పెద్దగా వేచి ఉండకుండానే శ్రీవారిని చూసే వీలు నేడు కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం వల్ల భక్తుల సంఖ్య తిరుమలలో అంతగా లేదు. వసతి గృహాలు కూడా వెంటనే భక్తులకు దొరుకుతున్నాయి. క్యూ లైన్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. గంటల తరబడి వేచి చూడకుండా స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది సహజంగా శుక్ర, శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఈరోజు ఇంకా తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూడకుండానే స్వామి వారి దర్శనానికి వెళ్లడానికి వీలవుతుంది. నేరుగా లైన్ కదులుతుండటంతో వెంటనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,356 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,815 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story