Mon Dec 23 2024 01:37:54 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలంలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ.. ఎక్కడి వాహనాలు అక్కడే
శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. భక్తులు సొంత వాహనాలతో ఇక్కడకు రావడంతో ట్రాఫిక్ సంస్య కూడా తలెత్తింది
శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. భక్తులు సొంత వాహనాలతో ఇక్కడకు రావడంతో ట్రాఫిక్ సంస్య కూడా తలెత్తింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో శ్రీశైలం కిటకిటలాడుతుంది. వీకెండ్ కావడంతో పాటు వేసవి సెలవులు కూడా తోడవ్వడంతో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
సొంత వాహనాలతో...
సొంత వాహనాలతో ఎక్కువ మంది రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. శ్రీశైలంలోని టోల్గేట్ సమీపంలో వాహనాలు అన్నీ నిలిచిపోయి ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీసులు కూడా పట్టించుకోక పోవడంతో గంటల తరబడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భక్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు వాహన యజమానులే ట్రాఫిక్ సమస్యను చక్క దిద్దుకునే పరిస్థితి తలెత్తింది.
Next Story