Fri Apr 18 2025 04:13:56 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం నేరుగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు నేడు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పరీక్షల ఫలితాలు వస్తుండటంతో ముందుగానే వచ్చిశ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుందామని ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. మరొకవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేటి నంచి ఆర్జిత సేవలు రద్దు...
తిరుమలలో నేటి నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. దీంతో తిరుమలలో నేటి తిరుప్పాడను రతిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు మూడు రోజులు పాటు శ్రీవారి ఆర్జిత సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మరొక వైపు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటున్న అధికారులు ఎక్కడ ఏ లోపం ఉందో? తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రానున్న వేసవిలో రద్దీని తట్టుకుని దర్శనం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
పది గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story