Mon Nov 25 2024 14:20:11 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ...తిరుమలలో నేడు నేరుగా దర్శనం... తక్కువ సమయంలోనే?
తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది. శనివారం అయినప్పటికీ వినాయక చవితి కావడంతో ఎక్కువ మంది భక్తులు ఇళ్లకే పరిమితమయ్యారు
తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది. శనివారం అయినప్పటికీ వినాయక చవితి కావడంతో ఎక్కువ మంది భక్తులు ఇళ్లకే పరిమితమయ్యారు. వినాయక చవితి రోజు ఇంట్లో పూజలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎప్పుడూ జరిగేదే అని అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మధ్యాహ్నం పూజలు ముగిసిన వెంటనే వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తారని, కొంత రష్ పెరిగే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. వినాయక చవితి కావడం, రైళ్లు రద్దు కావడంతో పాటు భారీ వర్ష సూచనతో తిరుమలకు రద్దీ తగ్గిందని చెబుతున్నారు. గత కొంతకాలంగా తిరుమలకు భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
అన్ని కంపార్ట్మెంట్లు....
తిరుమలలో నేడు భక్తులకు నేరుగా దర్శించుకునేందుకు నేడు వీలుంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులు లేక ఖాళీగా ఉన్నాయి. దీంతో వచ్చిన వారు వచ్చినట్లుగా నేరుగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఈరోజు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఉచిత క్యూ లైన్ లోకి టోకెన్లు లేకంుడా ప్రవేశించిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ ఉన్న భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుందని చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,100 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,817 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story