Tiruamala : గుడ్ న్యూస్.. శనివారమయినా తిరుమలలో రద్దీ లేదుగా
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం అయినా తిరుమలకు తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం అయినా తిరుమలకు తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. శని, ఆదివారాలు అత్యధిక సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాని ఈశనివారం భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీ గానే ఉన్నాయి. మరోవైపు శ్రీవారి భక్తులకు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేందుకు టీటీడీ ఏర్పాట్లను చేస్తున్నారు. తిరుపతి మరియు తిరుమలలో ఎస్ ఎస్ డి టోకెన్ల జారీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం మరియు ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా ఇప్పటికే టీటీడీ అధికారులు చర్చించారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విచ్చేసి భక్తుల రద్దీ కోసం వివిధ పార్కింగ్ ప్రాంతాలను కేటాయించడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ అలంకరణలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారుల పూర్తి చేశారు.