Thu Apr 03 2025 15:12:07 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు తిరుమలకు వెళ్లిన వారికి?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. నిన్నటి వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కానీ సోమవారం కావడంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. భక్తులు స్వామి వారిని సలువుగా దర్శించుకుంటున్నారు. పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం లభిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని వీధుల్లో కూడా భక్తుల రద్దీ అంతగా లేదు. వసతి గృహాల వద్ద కూడా అంతగా రద్దీ లేదు.
బోసిపోయిన వీధులు...
అన్న ప్రసాదాలు, లడ్డూ కౌంటర్ల వద్ద కూడా రద్దీ అంతగా లేకపోవడంతో భక్తులు సులువుగా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. భక్తులు సోమవారం నుంచి గురువారం వరకూ తక్కువగానే ఉంటారు. శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రోజు వారీ ఎస్.ఎస్.డి టోకెన్లు తీసుకున్న వారు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో లడ్డూల తయారీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొంత తగ్గించినట్లు చెబుతున్నారు.
వేచి ఉండకుండానే...
ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయంలో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story