Fri Apr 18 2025 13:52:31 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఆదివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఆదివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఇంత తక్కువ సంఖ్యలో భక్తులు ఉండటం చాలా అరుదైన విషయమని టీటీడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పరీక్షల సీజన్ కావడంతో...
సహజంగా మార్చి నెలలో పరీక్షలు జరుగుతుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు. వసతి గృహాలు కూడా వెంటనే దొరుకుతున్నాయి. లడ్డూ కేంద్రాలు, అన్న ప్రసాద కేంద్రం వద్ద కూడా రష్ అంతగా లేకపోవడంతో లడ్డూ తయారీ కూడా రోజు కంటే కొంత తగ్గించినట్లు అధికారులు తెలిపారు. తయారైన లడ్డూలు విక్రయించకపోతే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు కూడా అధికారులు రోజు చేస్తారు.
ఖాళీగా కంపార్ట్ మెంట్లు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులు లేకుండా ఖాళీగానే ఉన్నాయి. నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రేపటి నుంచి కూడా భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుందని అదఇకారులు అంచనా వేస్తున్నారు.
Next Story