Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. స్వామి వారి దర్శనం సులువుగా జరుగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. స్వామి వారి దర్శనం సులువుగా జరుగుతుంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే దర్శనం గత కొద్ది రోజుల నుంచి లభిస్తుంది. దీపావళి వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల వరసగా ఏపీలో తుపాన్లు, భారీ వర్షాల హెచ్చరికలతో పాటు రైళ్లు రద్దు వంటి కారణాలతో భక్తుల రాకపోకలు తిరుమలకు తగ్గాయి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ముందుగా బుక్ చేసుకున్న భక్తులు తప్పించి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడం లేదు. అన్నీ వెంటనే భక్తులకు అందుబాటులోకి వస్తున్నాయి. తలనీలాలను సమర్పించే వద్ద కూడా రష్ లేదు. ఎక్కడ చూసినా ఖాళీ వీధులే దర్శనమిస్తున్నాయి. దీపావళి ఆస్థానం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సిఫార్సు లేఖలను కూడా తీసుకోమని ముందుగానే ప్రకటించారు.