Fri Nov 22 2024 21:16:26 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శనివారం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శనివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శనివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో శ్రీవారిని సులువుగానే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో భక్తులు పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ నెలాఖరు నుంచి తిరిగి భక్తుల అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఎనిమిది గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 62,593 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 18,517 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.31 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
Next Story