Tiruamla : తిరుమలలో నేడు సులువుగానే స్వామి వారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం అయినా రద్దీ పెద్దగా లేదు. కంపార్ట్మెంట్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం అయినా రద్దీ పెద్దగా లేదు. కంపార్ట్మెంట్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. స్వామి వారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుంది. తక్కువ మంది భక్తులు ఉండటంతో పెద్దగా ఇబ్బందులు పడకుండానే వసతిగృహాలు దొరుకుతున్నాయి. వేచి ఉండకుండానే వసతి గృహాలు దొరుకుతుండటంతో పాటు వెనువెంటనే తలనీలాల సమర్పణ వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుని భక్తులు దర్శనానికి వెళుతున్నారు. నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అయితే తిరిగి దసరా సెలవులు అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. పండగకు ముందు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దసరా సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు కష్టంగా ఉంటుందని, బ్రహ్మోత్సవాలకు అధిక శాతం మంది హాజరవుతారని, అప్పుడు ఆర్జిత సేవలు కూడా ఉండవని అధికారులు చెబుతున్నారు.