Tirumala : నేడు తిరుమల శ్రీవారి దర్శనం నేరుగా.. వేచి ఉండకుండానే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో పాటు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో భక్తుల సంఖ్య తగ్గింది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో పాటు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో భక్తుల సంఖ్య తగ్గింది. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. పెద్దగా కష్టపడకుండా, వేచి ఉండాకుండానే తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని మూడు రోజుల నుంచి దర్శించుకుంటున్నారు. ఒక్కొక్కరు రెండు సార్లు శ్రీవారిని కనులారా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరిగి వచ్చే నెల మొదటి వారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో అప్పుడు విపరీతమైన రద్దీ పెరుగుతుందన్న అధికారులు అంచనాతో ఇప్పుడు మాత్రం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఎక్కడా వేచి ఉండాల్సిన సమయం లేదు. కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. లడ్డూ కౌంటర్ల వద్ద కూడా పెద్దగా రద్దీ లేదు. దీంతో లడ్డూలు అధిక సంఖ్యలో భక్తులు కొనుగోలు చేస్తున్నారు. తిరిగి శుక్రవారం నుంచి రద్దీ మొదలయ్యే అవకాశాలున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.