Mon Apr 21 2025 13:17:00 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : టీటీడీ సంచలన నిర్ణయం నేటి నుంచే అమలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. అలా అని అంత తక్కువ స్థాయిలో కూడా లేదు. పరవాలేదు అనిపించేలా రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో కొన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి కూడా కొంత సమయం పడుతుంది. గత మూడు రోజుల నుంచి పోలిస్తే ఈరోజు భక్తుల సంఖ్య కొంత పెరిగింది. రేపటి నుంచి మరింతగా పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి ఏరోజుకారోజు...
ఈరోజు నుంచి తిరుమలలో ఏరోజు కారోజు దర్శన టోకెన్లు ఇస్తున్నారు. భక్తులు టోకెన్లు తీసుకుని నేరుగా స్వామి వారిని దర్శనం చేసుకునేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు నుండి ఏ రోజు కా రోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను పొందవచ్చని తెలిపింది.
ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,223 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,704 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.10 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వచ్చారు.
Next Story