Tirumala : తుపాను ఎఫెక్ట్.. నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే కనపడుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే కనపడుతుంది. దీనికి తోడు తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల రాక తిరుమలకు తగ్గింది. అందుకే కంపార్ట్ మెంట్లలో పెద్దగా భక్తులు లేరు. స్వామి వారి దర్శనం కూడా సులువుగానే పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ లోనూ అందులోనూ చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో భక్తుల రాక తిరుమలకు తగ్గిందని అఢికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తుపాను ప్రభావం రేపటి నుంచి ఏపీలోని మూడు జిల్లాల్లో అత్యధికంగా ఉండే అవకాశమున్నందున భక్తులు తమ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.