Sun Dec 22 2024 21:50:59 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : సండే కూడా ఇంత సులువుగా స్వామి వారి దర్శనమా? ఇది నిజమా?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం అయినా భక్తుల ఎక్కువ సంఖ్యలో లేరు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం అయినా భక్తుల ఎక్కువ సంఖ్యలో లేరు. సాధారణంగా శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంందని భావించి మిగిలిన రోజుల్లో భక్తులు తిరుమలకు వస్తుండటం వల్లనే శని, ఆదివారాలు కొంత ఖాళీగా దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కూడా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణంగా మరికొందరు అధికారులు చెబుతున్నారు. తిరుమలలో వారం రోజుల్లో ఎక్కువగా శుక్ర, శని, ఆది వారాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆ రోజుల్లోనే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపడతారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు.
పదకొండు కంపార్ట్మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదకొండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,140 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 28,256 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story