Sun Nov 24 2024 23:44:53 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : రద్దీ తక్కువే.. ఆదాయం మాత్రం ఎక్కువే
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. దీపావళి పండగ సమీపిస్తుండటంతో భక్తులు పెద్దగా తిరుమలకు రావడం లేదు. దీంతో క్యూ లైన్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. పెద్దగా భక్తులు లేకపోవడంతో దర్శన సమయం కూడా తక్కువగా జరుగుతుంది. పండగకు ముందు ఈ విధంగా భక్తులు తగ్గడం మామూలేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఆరు గంటల్లోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆరు కంపార్ట్మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం క్యూ లైన్ నుంచి స్వామి వారిని దర్శించుకోవడానికి కేవలం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,157 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,054 మంది భక్తుల తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story