Fri Nov 22 2024 14:13:23 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు ఇప్పుడు వెళితే స్వామి వారి దర్శనం...?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల రద్దీ అంతగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల రద్దీ అంతగా లేదు. దీపావళి సెలవులు వచ్చినా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెద్దగా లేదు. దీపావళి పండగ ఇంటిల్లిపాదీ ఇంట్లోనే ఉండి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పైగా నోములు వంటివి కూడా ఉండటంతో ఇంటిపట్టునే ఉండి లక్ష్మీదేవిని పూజించుకుంటారు. తమ ఇంటి అష్టైశ్వర్యాలు, ఆయురోరాగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటారు. అందుకే దీపావళి సెలవు దినాలకు కూడా పెద్దగా భక్తుల రాక ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఎనిమిది గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లో పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే వారికి స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,778 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story