Mon Dec 23 2024 05:47:50 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఈరోజు కూడా
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సంఖ్య ఎక్కువగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సంఖ్య ఎక్కువగా లేదు. తుఫాను ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల్లో ఉండటం, రైళ్లు, విమానాలు రద్దు కావడంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. మూడు వందల రూపాయల దర్శనం టిక్కెట్లను ముందుగా బుక్ చేసుకున్న వాళ్లు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మళ్లీ వీకెండ్ లో భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 45,275 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 14,295 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.32 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు మాత్రం నాలుగు గంటల సమయం దర్శనం పడుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story