Fri Nov 22 2024 17:48:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఆదివారమూ రద్దీ లేదు.. కారణం ఇదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వీకెండ్ లోనూ రష్ లేకపోవడానికి కారణం ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావం అని చెప్పొచ్చు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వీకెండ్ లోనూ పెద్దగా రష్ లేకపోవడానికి కారణం ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావం అని చెప్పొచ్చు. తుఫాను ప్రభావం ఎన్నాళ్లు ఉంటుందో తెలియక ముందుగా ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు కూడా రద్దు చేసుకోవడంతో తిరుమలలో పెద్దగా భక్తుల రద్దీ కనిపించడం లేదు. సాధారణంగా శని, ఆదివారాల్లో తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి వారం వీకెండ్ లో చేస్తూ వస్తుంది.
నిన్న ఆదాయం...
నిన్న తిరుమలకు 68,769 మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 28,904 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story