Wed Oct 30 2024 01:30:03 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా హుండీ ఆదాయం మాత్రం పెరిగిందే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. ఇటీవల కాలంలో గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం నిరీక్షించాల్సిన సమయం నెలకొంది. వసతి గృహాల కోసం కూడా ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వారం అనేది తేడా లేకుండా భక్తుల రద్దీ పెరగడంతో భక్తలు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడం, ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులతో పాటు అప్పటికప్పుడు వచ్చే వారి సంఖ్య పెరిగి పోవడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే బుధవారం మాత్రం భక్తుల రద్దీ అంతగా లేదని, శ్రీవారి దర్శనం సులువుగానే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఎనిమిది గంటలు...
అయితే తిరిగి శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్వనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,937 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,978 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం 4.58 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story