Mon Apr 21 2025 20:21:37 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఇలా ఉందిగా?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శనివారం కావడతో భక్తులు కొద్దిగా ఎక్కువ సంఖ్యలోనే కనపడుతున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శనివారం కావడతో భక్తులు కొద్దిగా ఎక్కువ సంఖ్యలోనే కనపడుతున్నారు. శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే కాకుండా స్థానికులు అంటే తిరుపతి పట్టణం, చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మంది భక్తులు నేడు శ్రీవారిని దర్శించుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. హుండీ ఆదాయం కూడా బాగానే ఉండే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటున్నారు.
ఎప్పుడూ రద్దీనే...
తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అన్ని ప్రాంతాల నుంచి భక్తుల తరలి వస్తారు. శీతాకాలం కావడంతో ఎక్కువ మంది దక్షిణ ప్రాంత తీర్థయాత్రలు ఎక్కువగా ఈ కాలంలో చేపడతారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వస్తూ తిరుమలను దర్శించుకునే వారు కూడా ఎక్కువగా ఉన్నారు. అందుకే తిరుమలలో రద్దీ పెరగడానికి ఒక సీజన్ అంటూ ఏమీ ఉండదు. ఇక వేసవి కాలం సెలవులు కావడం, పరీక్ష ఫలితాలు వెలువడటంతో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారు.
పది గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 57,655 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,051 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.73 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story