Tue Nov 26 2024 20:03:22 GMT+0000 (Coordinated Universal Time)
శనివారం కదా.. రష్ ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరు స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి 34 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల పాటు దర్శన సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 60,861 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,519 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.53 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story