Tue Apr 22 2025 04:24:19 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఆదివారం తిరుమల వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఆదివారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఆదివారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మార్చి నెల మొదటిలో కొంత రష్ తగ్గినట్లు కనిపించినప్పటికీ తర్వాత క్రమంగా భక్తుల రాక మొదలయింది. మొన్నటి వరకూ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతుండటంతో అక్కడకు వెళ్లిన భక్తులు ఎక్కువ మంది ఉండటంతో తిరుమలకు భక్తుల రాక కొంత తగ్గిందని, అది పూర్తి కావడంతో తిరిగి భక్తుల రాక మొదలయిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు...
నేటి నుంచి తిరుమలలో ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.తొలి రోజు శ్రీరాముడి అవతారంలో స్వామి వారు తెప్పలపై విహరించనున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు సహస్ర దీపాలంకరణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. పరీక్షల సీజన్ అయినా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రేపటి నుంచి మళ్లీ తిరుమలలో భక్తుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశముంది.
28 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,646 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,769 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story