Tirumala : తిరుమలలో నేడు పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు చాలా తక్కువగా ఉంది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అస్సలు లేదనే చెప్పాలి
తిరుమలలో భక్తుల రద్దీ నేడు చాలా తక్కువగా ఉంది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అస్సలు లేదనే చెప్పాలి. శ్రీవారి దర్వనం చాలా సులువుగానే అవుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారిని దర్శనం లభించడమే కాకుండా ఎక్కువ సేపు స్వామి వారి చెంత ఉండే అవకాశం కూడా లభిస్తుందని చెబుతున్నారు. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు, భారీ వర్ష సూచనతో తిరుమలలో రద్దీ తక్కువగా ఉందని చెబుతున్నారు. డిసెంబరు నెల కావడంతో ఎక్కువ సంఖ్యలో తిరుమలకు భక్తులు రావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఇంకా తిరుమలకు రద్దీ పెరగలేదు. ప్రస్తుతం శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో సాధారణ సంఖ్యలోనే భక్తులు తిరుమలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదీ చుట్టు పక్కల ప్రాంతాల వారు మాత్రమే వచ్చిశ్రీవారిని దర్శించుకుంటున్నారు. దూర ప్రాంత ప్రయాణికులు మాత్రం తిరుమల వచ్చేందుకు వర్ష సూచనతో కొంత వెనకడగు వేస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే తిరుమలలో గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడానికి కారణమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు.