Mon Dec 23 2024 09:18:45 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : గోవిందా... కనికరించావా?.. నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. గత పదిహేను రోజులుగా భక్తుల రద్దీతో కిటకిటలాడిన తిరుమల ఈరోజు భక్తులు త్వరగా దర్శనం చేసుకుంటున్నారు. పెద్దగా వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనం లభిస్తుంది. క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పనిలేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 76,291 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిలో 28,495 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.14 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
Next Story