Fri Nov 22 2024 16:04:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శుక్రవారమైనా భక్తుల రద్దీ పెద్దగా లేదు... రీజన్ ఇదే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారమైనా భక్తుల సంఖ్య పెద్దగా లేదు.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారమైనా భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్మెంట్లలో ఎక్కువ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వసతి గృహాలు కూడా భక్తులకు వెంటనే దొరుకుతున్నాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్నప్రసాదం వద్ద కూడా క్యూ లైన్ లో భక్తులు స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 55,537 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,486 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.02 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
Next Story