Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఇలానా? ఆదివారం కూడా
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారీ వర్షాలు లేకపోయినా, తుపాను వెళ్లిపోయినా, రైళ్లన్నీ తిరిగి మళ్లీ పట్టాలెక్కినా భక్తులు మాత్రం తిరుమలకు పెద్దగా రాలేదు. ఎక్కువ మంది తిరుమలకు ఆదివారం రాకపోవడంతో వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాడవీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వసతి గృహాలకు కూడా డిమాండ్ లేదు. భక్తుల సంఖ్య సండే కూడా సంఖ్య తక్కువగా ఉండటం నిజంగానే ఇదే ప్రధమమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటున్నారు. అయితే దీపావళి పండగ ఉండటంతో వరస సెలవులు వస్తుండటంతో ఇకపై తిరుమలలో రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీపావళి ఆస్థానం కూడా జరపనున్నారు. తిరుమల శ్రీవారి సేవలలో పాల్గొనేందుకు దీపావళి పర్వదినాల సమయంలో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటారని భావిస్తున్నారు.