Mon Dec 23 2024 13:47:10 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో ఈరోజు రద్దీ?
తిరుమలతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ఇప్పుడు భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ఇప్పుడు భక్తుల రద్దీ అంతగా లేదు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్నారు. నిన్నటి వరకూ కిటకిటలాడిన తిరుమల కొండ ఇప్పుడు కొంత రద్దీ తగ్గినట్లే కనిపిస్తుంది. మరో ఐదు రోజుల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అధికారులు బ్రహ్మోత్సవాలుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముండటంతో దానికి తగినట్లు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
సాధారణమే...
నిన్న తిరుమల శ్రీవారిని 68,828 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,768 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈరోజు ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story