Sat Nov 23 2024 23:03:50 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలతో భక్తుల రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. ఆరు కంపార్ట్మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమలలో అఖండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే తిరుమలతో భక్తుల రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం నాలుగు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సావాలు జరుగుతుండటం, నవరాత్రులు ఉండటంతోతో స్వామి దర్శనం కష్టమని భావించిన భక్తులు అధిక సంఖ్యలో రావడం లేదన్న అభిప్రాయం ఉంది.
నేడు సింహవాహనంపై...
నేడు స్వామి వారు సింహవాహనంపై ఊరేగుతారు. రాత్రికి ముత్యాల పందిరిపై శ్రీవారు దర్శనమిస్తారు. నిన్న 64,823 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వీరిలో 22,890 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.03 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు వృద్ధులు, వికలాంగులకు అక్టోబర్ నెలకు సంబంధించి ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచుతారు.
Next Story