Sat Nov 30 2024 16:46:09 GMT+0000 (Coordinated Universal Time)
Fengal Cyclone : ప్రయాణాలు రద్దు చేసుకోండి... లేకుంటే అవస్థలు తప్పవు
ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయి. రాత్రికి తమిళనాడులో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయి. రాత్రికి తమిళనాడులో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ తో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు మూసి వేశారు. చెన్నైకు రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ తో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన మూడు విమానాలు, చెన్నై నుంచి హైదరాబాద్ కు రావాల్సిన మరో మూడు విమానాలు రద్దయ్యాయి.
విమానాలు రద్దు...
వీటితో పాటు చెన్నై నుంచి విశాఖ, విశాఖ నుంచి తిరుపతి విమానాలు కూడా రద్దయ్యాయి. హైదారాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేశారు. ఈరోజు రాత్రికి చెన్నై నగరంలో కుండపోత వర్షం పడుతుందన్న హెచ్చరికతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగాలాండ్ లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తుపాను తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్న హెచ్చరికతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని తెలిపారు.
Next Story