Wed Dec 25 2024 07:18:22 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Alert : ఆంధ్రప్రదేశ్ కు అతి భారీ వర్షాలు.. ఏపీలో తుపాను తీరం దాటే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం పశ్చియ వాయువ్య దిశగా పయనిస్తూదక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఈ నెల 25వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. తర్వాత వాయువ్వ దిశగా కదులుతూ రెండు రెండు రోజుల్లో తమిళనాడు - శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని తెలిపారు.
భారీ వర్షాలు...
ఈ ప్రభావంతో ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి మోస్తరు వర్షాు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగానూ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రధానంగా కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. వరసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు దాటే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కోరారు.
ఈ నెల 27నాటికి...
ఈ నెల 27 నాటికి వాయుగుండం తుపానుగా మారుతుందని, అది తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రైతులు తమ పంట ఉత్పత్తులను వర్షం నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశముందని, పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. తుపాను కారణంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
Next Story