Fri Nov 22 2024 19:34:36 GMT+0000 (Coordinated Universal Time)
తీరం దాటిన తుఫాన్ ... పంట మొత్తాన్ని మింగేసి వెళ్లింది
మిచౌంగ్ తుఫాను తీరం దాటేసింది. బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటింది.
మిచౌంగ్ తుఫాను తీరం దాటేసింది. బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటింది. తీరం దాటే సమయంలో పెద్దయెత్తున ఈదురుగాలులు వీచాయి తీరం వెంట దాదాపు వంద కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో మిచౌంగ్ తుఫాన్ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రమంతటా వర్షాలు...
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈదురుగాలులు, భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంటలు పూర్తిగా వానకు తడిసి పోయింది. ఎక్కువగా కోస్తాంధ్ర ప్రాంతంలోని పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగిందని ప్రాధమికంగా తేల్చారు. ప్రధానంగా పసుపు, పొగాకు, అరటి, వరి పంటలు దెబ్బతిన్నాయి.
Next Story