Mon Nov 25 2024 18:17:43 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone : దూసుకొస్తోన్న మిచౌంగ్ తుఫాన్
ఆంధ్రప్రదేశ్ కు మిచౌంగ్ తుఫాను ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు
ఆంధ్రప్రదేశ్ కు మిచౌంగ్ తుఫాను ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో వాయువ్య దివగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను గంటలకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని పేర్కొంది. రేపు మధ్యాహ్ననం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశముందని తెలపింది.
తుఫాను ప్రభావంతో...
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నేడు,రేపు కూడా కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ల కుండా నిషేధం విధించింది.
Next Story