Mon Dec 23 2024 01:18:54 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Michaung : బలహీనపడుతున్నా... నష్టం తప్పదట
ఆంధ్రప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాను బలహీనపడుతుంది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడనున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాను బలహీనపడుతుంది. వాయుగుండం బలహీనపడుతుండటంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు కూడా అనేక జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
విస్తారంగా వర్షాలు...
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.తీరం వెంబడి గంటకు 45 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరికొద్ది గంటల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశముంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాను కారణంగా భారీగా ఆస్తి, పంట నష్టం జరిగిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story