Sun Dec 22 2024 21:17:19 GMT+0000 (Coordinated Universal Time)
Midhili Cyclone : నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ కు మిథిలీ తుపాను గండం పొంచి ఉంది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుంది
ఆంధ్రప్రదేశ్ కు మిథిలీ తుపాను గండం పొంచి ఉంది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుపానుగా బలపడుతుందని, దీనికి మిథిలీగా నామకరణం చేయనున్నారు. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది.
తుపాను గా మారి...
ఈశాన్య దిశగా కొనసాగి రేపటికి ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీరం వెంట బలమైన గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న కారణంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఏపీలో కూడా నేడు, రేపు భారీ వర్సాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు. మత్స్యాకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచనలు చేశారు.
Next Story