Thu Dec 19 2024 18:50:00 GMT+0000 (Coordinated Universal Time)
20 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం
మిగ్జామ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని దాటనుంది. ఈ నేపథ్యంలో
మిగ్జామ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని దాటనుంది. ఈ నేపథ్యంలో బాపట్ల వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20 అడుగుల ముందుకు తుపాను చొచ్చుకొచ్చింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తుపాను నేపథ్యంలో 11 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో కోత గురయిన ప్రాంతాలను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సందర్శించారు. ఉప్పాడ, మాయపట్నం, సుబ్బంపేటలో బైక్ మీద తిరుగుతూ తుఫాన్ సహయక చర్యలు పరిశీలించారు ఎమ్మెల్యే దొరబాబు. మిచౌంగ్ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంళవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు.
Next Story