Mon Dec 23 2024 05:29:19 GMT+0000 (Coordinated Universal Time)
బాటిల్స్ పగలగొడుతూ.. ఫైర్ అయిన పురందేశ్వరి
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన మద్యం దుకాణాల ముట్టడి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫైర్ అయ్యారు. మద్యం సీసాలను ధ్వంసం చేశారు. మద్యానికి బానిసై అనారోగ్యంతో నరసాపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించారు పురందేశ్వరి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
మద్యం దుకాణం వద్ద మద్యం సీసాలను పురందేశ్వరి పగులగొట్టారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు పురందేశ్వరి. మద్యం దుకాణంలో ఉన్న వ్యక్తి నుంచి ఈరోజు వచ్చింది ఎంత? బిల్లులు ఇచ్చింది ఎంత? అని ఆరా తీశారు. అనంతరం మద్యం సీసాలతో నిరసన తెలిపి, వాటిని ధ్వంసం చేశారు. లక్ష రూపాయల విలువైన సరుకులు అమ్మితే బిల్లు ఇచ్చింది మాత్రం రూ.700 మాత్రమే అని ఆరోపించారు పురందేశ్వరి. తాను కొన్ని రోజులుగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే విషయం చెబుతున్నానని, ఇప్పుడు తాను చెప్పినదానికి ఇది సజీవ సాక్ష్యమన్నారు. మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ఆడుకుంటోందన్నారు.
Next Story