Mon Dec 23 2024 06:06:59 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన ఆ మాట చెప్పలేదు కదా!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేయగా.. టీడీపీ-జనసేన వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు. అయితే ఓ విషయంలో మాత్రం సరైన క్లారిటీ లేదు. అదేమిటంటే టీడీపీ-జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీజేపీని కూడా కలుపుకుని వెళ్తాయా లేదా అన్నది. అందుకు సంబంధించి తాజాగా కొన్ని హింట్స్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి.
ఏపీలో తమ పొత్తులను బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రస్తుతానికి జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని, తమతో తెగదెంపులు చేసుకున్నట్టు జనసేన ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించిందని, రాజధాని అమరావతికి కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని అన్నారు. పోలవరం నిర్మాణంలో ప్రతి పైసా కేంద్రానిదేనని, త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా బీజేపీని సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై తాము కూడా పోరాటం చేస్తున్నామని, నకిలీ ఐడీలతో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ కు కూడా వివరించామని తెలిపారు.
Next Story