Mon Dec 23 2024 07:41:35 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
వైసీపీమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా ఈరోజు దర్శి పోలీస్టేషన్ ఎదురుగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. రెండురోజుల క్రితం కురిచేడు మండలం డేగనకొండ గ్రామంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గణేష్ నిమజ్జనోత్స వాన్ని టీడీపీ వర్గం అడ్డుకు న్నారని ఆరోపించారు.
అక్రమ కేసులకు నిరసనగా...
తమపై వైసీపీ వర్గం ధాడులకు పాల్పడిందని టీడీపీ వర్గం ప్రత్యారోపణలు చేసుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం వైసీపీ వర్గానికి చెందిన 25మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారంటూ ఎమ్మెల్యే ధర్నా కు పిలుపునివ్వడంతో దర్శిలో టెన్షన్ నెలకొంది. దర్శిలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే నివాసం వద్ద భారిగా పోలీసులు మొహరించారు. దర్శి పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Next Story