Mon Dec 23 2024 03:15:54 GMT+0000 (Coordinated Universal Time)
Tdp, janasena : సమన్వయ కమిటీ తొలి భేటీ తేదీ ఖరారు
తెలుగుదేశం పార్టీ, జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం తేదీ ఖరారయింది
తెలుగుదేశం పార్టీ, జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం తేదీ ఖరారయింది. ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన సమన్వయ కమిటీ సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలిసారి రాజమండ్రిలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నారు.
ఈ నెల 23న...
టీడీపీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారయిన తర్వాత సమన్వయ కమిటీలు రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి కాని ఇప్పటి వరకూ సమావేశం జరగలేదు. అయితే ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ నెల 23న జరిగే సమావేశంలో ప్లాన్ చేయనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
Next Story