Sun Jan 12 2025 23:51:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా విధానంలో ఇప్పటికే మార్పులు తీసుకువస్తూ పలు నిర్ణయాలను తీసుకున్న జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు...
ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 210 హైస్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story