Thu Dec 19 2024 18:27:39 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : భారీగా పెరిగిన తిరుమల లడ్డూల విక్రయాలు
తిరుమల శ్రీవారి లడ్డూకు భారీగా పెరిగిన డిమాండ్ పెరిగింది. లడ్డూ వివాదం విక్రయాలపై పడలేదు
తిరుమల శ్రీవారి లడ్డూకు భారీగా పెరిగిన డిమాండ్ పెరిగింది. లడ్డూ చుట్టూ వివాదాలతో లడ్డూ విక్రయాలు తగ్గుతాయని భావించినప్పటికీ లడ్డూ విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న వార్తలతో ఎవరూ కొనుగోలు చేయకుండా ఉండలేదు. తగ్గని కొనుగోళ్లు...లడ్డూ వివాదం తిరుమల లడ్డూ విక్రయాలపై ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు తెలిపారు.
నెయ్యి వివాదం...
లడ్డూ తయారీలో తప్పిదాలు జరిగినా శ్రీవారి లడ్డూను పరమ పవిత్రంగా భక్తులు భావించడమే ఇందుకు కారణమంటున్నారు. ఈ నెల 19న 3.59 లక్షలు, 20న 3.16 లక్షలు, 21న 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story