Mon Dec 23 2024 00:53:51 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : అధికారులపై పవన్ సీరియస్.. వెంటనే నివేదిక ఇవ్వాలంటూ?
అధికారులపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.
అధికారులపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పదిహేనో ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడంపై ఆయన ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్ వ్యాధులు, డయేరియా లాంటివి ప్రబల కుండా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులపై సమీక్ష నిర్వహించారు. వరుస ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు.
పదిహేనో ఆర్థిక సంఘం...
పదిహేనో ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లింపుపై నిలదీశారు. నిధులను స్థానిక సంస్థలకు ఇవ్వకుండా ఎందుకు దారి మళ్లించాల్సి వచ్చిందో చెప్పాలని కోరారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సని పదిహేనో ఆర్థిక సంఘం నిధులను సీఎంఎంఎస్ ఖాతాలకు మళ్లింపు పై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Next Story