Tue Mar 25 2025 05:44:10 GMT+0000 (Coordinated Universal Time)
జనసైనికులకు పవన్ వార్నింగ్.. ఎందుకంటే?
పిఠాపురంలో జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

పిఠాపురంలో జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.పిఠాపురం నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతుండగాజనసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. వారి నినాదాలతో పవన్ ప్రసంగం వినిపించకుండా పోయింది. దీంతో ఒక్కసారిగా అసహనానికి డిప్యూటీ సీఎం పవన్ గురయ్యారు.
ప్రసంగిస్తున్న సమయంలో...
తన ప్రసంగం వినిపించకుండా నినాదాలు ఆపకుండా చేస్తున్న అభిమానులు, కార్యకర్తలకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. అలుసుగా చూస్తే అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రేమగా మాట్లాడుతుంటే అలుసు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి వారికి జగన్ అయితేనే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు తనకు శతృవులు కాదంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు
Next Story