Thu Nov 21 2024 23:31:37 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ ప్రాంత ప్రజలకు పవన్ గుడ్ న్యూస్
కాకినాడ ప్రాంత ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు.
కాకినాడ ప్రాంత ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. 2023లో మిచాంగ్ తుపాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పలుసాగు నీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశారు. దాదాపు సాగునీటి ప్రాజెక్టులు కాకినాడ జిల్లాలో దెబ్బతినడంతో వాటిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి ఈ సమస్యలు తీసుకు రావడంతో ఆయన అత్యంత వేగంగా స్పందించారు. మొత్తం వెంటనే చేపట్టాల్సిన 39 పనులకు 8.97 కోట్ల రపాయలను నిధులను విడుదల చేయించారు.
నిధులను మంజూరు చేసి...
వీటికి పరిపాలనమైన అనుమతులు కూడా లభించాయి. ఇరిగేషన్ శాఖ వెంటనే టెండర్లను చేపట్టి రెండు నెలల్లోగా ఈ సాగునీటి ప్రాజెక్టు మరమ్మతు పనులను పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ గ్రామీణ ప్రాంతం, ముమ్మడివరం, పెద్దాపురం, పత్తిపాడు, పిఠాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో ఈ మరమ్మతు పనులను చేపట్టనున్నారు. కొన్ని సాగునీటి ప్రాజెక్టులలో పూడికతీత పనులను చేపట్టాల్సి ఉంది. వీటిని వెంటనే ప్రారంభించాలని పవన్ ఆదేశించారు.
Next Story