Thu Apr 10 2025 18:06:37 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఇద్దరి భేటీ అందుకేనా?
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు

మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై పవన్ చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు పిఠాపురంలో జనసేన జయకేతనం సభ సక్సెస్ కావడంపై కూడా ఇద్దరు నేతలు చర్చించుకున్నారని సమాచారం.
నామినేటెడ్ పోస్టుల విషయంలో...
దీంతో పాటు రాజధాని అమరావతి పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడంతో పాటు కేంద్ర మంత్రులను కలసి వినతులను అందించడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో త్వరలో భర్తీ కానున్న నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలిసింది.
Next Story