Thu Jan 02 2025 14:55:25 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నాగబాబు మంత్రిపదవిపై పవన్ క్లారిటీ
తన సోదరుడు నాగబాబు మంత్రి పదవిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు
తన సోదరుడు నాగబాబు మంత్రి పదవిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆయనను కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమని తెలిపారు. మార్చి నెలలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారని, ఆతర్వాత మాత్రమే కేబినెట్ లోకి తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. నాగబాబుకు తన సోదరుడిగా కేబినెట్లో అవకాశం ఇవ్వడంలేదని ఆయన అన్నారు. తనతో సమానంగా నాగబాబు పనిచేశారన్న పవన్‌కల్యాణ్ తన సోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడినని పవన్ అన్నారు.
కులం ప్రస్తావన ఇక్కడ ఎందుకు?
కందుల దుర్గేష్ది ఏ కులమో తనకు తెలియదన్న పవన్ నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత తనతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడినని తెలిపారు. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను వారసత్వంగా చూడలేమని పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటన చేస్తానని పవన్‌కల్యాణ్ తెలిపారు. నెలకు 14 రోజులు జిల్లాల్లో పర్యటిస్తానని, ఆరు నెలల్లో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తానని, ఇకపై పార్టీకి సమయం కేటాయిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story